హీరో అయిన ధోని .. ఇంతకీ దేంట్లో?

Thursday, May 3rd, 2018, 03:45:21 PM IST

ఓ ప్లేయర్‌గా, ఓ కెప్టెన్‌గా, అన్నిటికంటే మించి ఓ క్రికెటర్ గా ధోనీ తన కెరీర్ లో ఎంత సక్సెసయ్యాడో అందరికీ తెలిసిందే. ఇక ఫీల్డ్‌లో బ్యాట్ పట్టుకొని దిగినప్పుడు ధోనీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఫీల్డ్ బయట కూడా ధోనీ రియల్ హీరోనే అంటున్నది ట్విట్టర్. మొన్న మేడే సందర్భంగా ధోనీ గ్రౌండ్ స్టాఫ్‌తో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన ఫొటోలను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఓ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సాయపడే ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ధోనీ సింప్లిసిటీని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సీజన్ ఐపీఎల్‌లో ధోనీ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 8 మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు సహా 71 సగటుతో పరుగులు సాధించాడు ధోనీ. అతని జోరుతో చెన్నై పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నది. ప్రస్తుతానికి ట్విట్టర్ లో ధోనీ అందరికంటే ముందంజలో ఉండి ఒక రియల్ హీరోలా మారాడు.