డేటా బీచ్ కుంభకోణంలో ఫేస్ బుక్ ట్విట్టర్ అన్నదమ్ములయ్యారా..?

Monday, April 30th, 2018, 03:55:47 PM IST

ఫేస్‌బుక్‌ చసిన డేటా బ్రీచ్‌ కుంభకోణం ఆందోళన యూజర్లను ఇంకా వీడకముందే..ఇప్పుడు మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టిస్తూ హడలెత్తిస్తునాయి. ట్విటర్‌కు సంబందించిన పూర్తి యూజర్‌ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఇప్పుడు సొంతం చేసుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల అనుమతి లేకుండానే పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థకు కొన్ని కోట్ల డబ్బుకి అమ్మేసింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విటర్‌ మరో షాకింగ్‌ న్యూస్‌ వేలువరిచింది. అయితే 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని ఈ జిఎస్ఆర్ పేర్కొంది.

బ్లూంబర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం 2015లో, జీఎస్‌ఆర్‌ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్‌ ఇచ్చామని ట్విటర్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా నేడేటా లీక్‌ అయ్యిందని గుర్తించినట్టు సవివరంగా వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్‌ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు మరోసారి తీవ్ర దుమారం రేగింది. ఇకనుండైనా ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ యూజర్లు క్స్సర్త జాగ్రత్తగా ఉండాలని జిఎస్ఆర్ సంస్థ వెల్లడించింది.

  •  
  •  
  •  
  •  

Comments