ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్.. ఆందోళనలో పార్టీ వర్గం

Saturday, May 19th, 2018, 01:54:20 PM IST

గంట గంటకీ కర్ణాటక ఎలక్షన్ల విషయాలు ఒకవైపు ఆసక్తి రేపుతుంటే మరోవైపు ఆయ పార్టీ నేతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఎప్పుడు ఏ కొంప మునుగుతుందా అన్న ఆలోచనలో ఉక్కురి బిక్కిరు అవుతున్నారు శాసన సభ ఎమ్మెల్యేలు. అయితే కొద్దిసేపటి క్రితమే కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అంటా బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆనంద్ శర్మ, ప్రతాప్ గౌడ అనే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలయ్యి ఇంట సమయం గడిచినా కూడా వాళ్ళు ఈ సభకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతూ దిగాలుగా కూర్చున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం 4 సమయంలో భాజాపా సీఎం బలనిరూపణ పరీక్ష సమరానికి సిద్దం అయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments