పెళ్ళికి దారితీసిన ఇద్దరు అమ్మాయిల ఫేస్ బుక్ పరిచయం !

Thursday, January 18th, 2018, 02:13:59 PM IST

వినడానికి వింత గా వున్నా ఈ ఘటన నిజంగానే జరిగింది. కర్ణాటక రాజధాని బెంగుళూరు లోనే కోరమంగళ పోలీస్ ల కధనం ప్రకారం బెంగుళూరు లోని అడుగోడి లో నివసించే గీత అనే యువతీ, మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉంటున్న దీప అనే యువతికి కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లపాటు సాగిన వారి పరిచయం చివరకు వింతగా ప్రేమకు దారి తీసింది. చివరకు వారిరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయమై బెంగుళూరు నుండి గీతను తీసుకెళ్లాలని మహారాష్ట్ర నుండి వచ్చిన దీప ఇద్దరు కలిసి గీత తల్లితండ్రుల వద్దకు వెళ్లి మేము ఇద్దరమూ ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అనేసరికి, వారికి కోపం వచ్చి ఇద్దరు ఆడపిల్లలు ఎలా పెళ్లి చేసుకుంటారని గట్టిగా నిలదీయడంతో ఇద్దరు మహారాష్ట్ర వెళ్లిపోయారని, ఈ విషయమై గీత తల్లి తండ్రులు కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు…