ఇద్దరు హీరోయిన్ల సమరం..రెడీ అని తేల్చేసిన రోజా..!

Friday, December 8th, 2017, 08:23:46 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత వేడెక్కి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలవరం గురించి టీడీపీ, బిజెపి, వైసిపి మరియు జనసేన మధ్య మాటల తూటాలు పేలుతుంటే పవన్ వ్యక్తిగతంగా కొందరు నాయకులని టార్గెట్ చేస్తూ హీటెక్కిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఎలాగు ఉన్నాయి. జగన్ పై వచ్చే విమర్శలని తిప్పి కొట్టడంలో ఫైర్ బ్రాండ్ రోజా తాను ఉన్నానంటూ ముందుకువస్తారు.

కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రజని ఎదుర్కొనడానికి చంద్రబాబు సినీతారని రంగంలోకి దించబోతున్నారు. అలనాటి నటి వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. రోజాకు పోటీగా నగిరి నుంచి బరిలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ వాణి విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రోజా కూడా వాణి విశ్వనాథ్ పై పోటీకి సై అనేశారు. వాణి విశ్వనాథ్ టీడీపీ కండువా కప్పుకోవడం ఆలస్యం ఈ ఇద్దరు సినీతారల పోటాపోటీ వ్యాఖ్యలకు నగిరి వేదిక కానుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments