క‌విత‌ స‌హాయమంత్రి..! కేకేకి ఏం ఇస్తారు?

Tuesday, December 27th, 2016, 03:49:54 AM IST

kavitha
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ‌కు చెందిన ఓ ఇద్ద‌రు నేత‌ల‌కు ఆల్మోస్ట్ ప‌ద‌వులు ఖాయ‌మైపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు కేంద్రం స‌హాయ‌మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకు రెడీ అవుతోందిట‌. అలాగే కె.కేశవరావుకు కేబినెట్ హోదాతో కూడిన పదవి ద‌క్కే ఛాన్సుంద‌ని వినికిడి. అయితే మోదీ ఇక ఫైన‌ల్ అని జెండా ఊప‌డ‌మే ఆల‌స్యం. అన్నిర‌కాలుగా మంత‌నాలు సాగిపోయాయి.

అయితే ఎంపీ క‌విత‌కు కేంద్రంలో స‌హాయ‌మంత్రి ప‌ద‌వి కంటే స్వ‌తంత్ర హోదాతో కూడిన మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప‌ట్టుబ‌డుతున్నారుట‌. ఆ ప‌నిలో భాగంగానే సీఎం ప‌లుమార్లు దిల్లీ వెళ్లి వ‌చ్చారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సంప్ర‌దింపులు సాగుతున్నాయి. వ‌చ్చే ఏడాది క‌ల్లా ఆ ఇద్ద‌రినీ కేంద్రంలో మంత్రులుగా చూడొచ్చ‌ని తేరాస‌లో ఠాంఠాం మోగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments