మ‌రో ఇద్ద‌రు వైకాపా ఎమ్మెల్యేలు జంపింగ్!

Friday, September 16th, 2016, 02:40:36 PM IST

ysrcp
టీడీపీ ఆపరేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు వైకాపా కుదేల‌వుతోంది. ఇప్ప‌టికే 20 మంది ఎమ్మెల్యేలు.. కొంద‌రు ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కారు. తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌కాశం జిల్లా సంత‌నూత‌ల పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే వెంక‌ట‌రెడ్డి టీడీపీ శ్రేణుల‌తో మంతనాలు జ‌రుపుతున్నార‌ట‌. సంత‌నూల‌పాడులో ఇటీవ‌ల చోటుచేసుకున్న సంఘ‌ట‌న కార‌ణంగానే సురేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అనుచరుల నుంచి వినిపిస్తోంది. ఇక వెంక‌ట‌రెడ్డి జ‌గ‌న్ వైఖ‌రి ప‌ట్ల అంస‌తృప్తిగా ఉండి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లా నుంచి అధిక సంఖ్య‌లో వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. 12 అసెంబ్లీ స్థానాల‌కు గాను డీటీపీ 5 స్థానాల‌ను సొంతం చేసుకోగా, 6 స్థానాల్లో వైకాపా జ‌య‌కేతనం ఎగ‌ర‌వేసింది. మిగిలిన ఒక స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గెలుచుకున్నాడు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, య‌ర్రంగొండ‌పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఇండిపెండెంట్ అభ్య‌ర్థి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా సైకిల్ ఎక్కిన సంగ‌తి తెలిసిందే.