“సైరా” సెట్స్ లో చేరనున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు.?

Saturday, March 16th, 2019, 12:20:40 AM IST

మెగాస్టార్ హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాలీవుడ్ మరో ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”.మొట్ట మొదటి స్వాతంత్ర్య తెలుగు సమర యోధుడు ”ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్,కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతి వంటి అగ్ర నటులు నటిస్తున్నారు.తన తండ్రి సినిమా కావడంతో కొడుకు రామ్ చరణ్ ఈ సినిమాను ఎక్కడా కూడా తగ్గకుండా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తానని తెలిపారు.

ఇప్పటికే షూటింగ్ అంతిమ దశకు చేరుకున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లోకి మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టినట్టు నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వారే స్వీటీ అనుష్క మరియు శృతి హాసన్.ఇప్పుడు వీరిద్దరూ సైరా లో కనిపించనున్నారని తెలుస్తుంది.మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఒకవేళ నిజమే అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడతాయి.మరి సురేందర్ రెడ్డి ఏం చేస్తారో ఏంటో వేచి చూడాలి.