ఇదేం గోల బాబోయ్..తమ పెళ్లి చేయకుంటే ఛస్తామంటున్న యువతులు..!

Sunday, February 19th, 2017, 11:38:27 AM IST


ఉత్తరప్రదేశ్ లోని మధుర పోలీస్ లు ఓ వింత సమస్యని తీర్చలేక లబోదిబో మంటున్నారు. ఇటీవల భర్తతో విడిపోయిన ఓ యువతి, మరో యువతీ కలసి తామిద్దరం ప్రేమించుకుంటున్నామంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ లకు షాక్ ఇచ్చారు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని పోలీస్ లను ఆశ్రయించారు. ఆ యువతుల వింత కోరిక విన్న పోలీస్ లు ఆశ్చర్యపోయారు. తమ వివాహం చేయకుంటే ఆత్మహ్య చేసుకుంటామని చెబుతుండడంతో పోలీస్ లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

మధురలోని ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన వీరు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం తమ ఇంట్లో వారికి చెబితే కొడుతున్నారని పోలీస్ లకు తెలిపారు. ఎలాగైనా తమ వివాహం చేయాలనీ లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుండడంతో పోలీస్ లు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు.