యూటర్న్ తీసుకుంది మేము కాదు, మీరు…!!!

Sunday, July 22nd, 2018, 11:08:55 AM IST

ప్రధాన మంత్రి మోడీ మరియు బీజేపీ పార్టీపై విరుచుకు పడ్డారు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న ఢిల్లీ లోని కాన్స్టిట్యూయనల్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన అయన, మోడీ కి పలు రకాల ప్రశ్నలు సంధించారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీని ఎంతో కర్కశంగా విడదీసి, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని చెప్పుకొచ్చిన మోడీ, పార్లమెంట్ లో తమపై వేసిన నిందలు తనను ఎంతో బాధించాయని వ్యాఖ్యానించారు. మొన్న అవిశ్వాసం పై జరిగిన వోటింగ్, నైతికతకు మరియు మెజారిటీకి జరిగిందని, తమకు వాస్తవానికి సరైన మెజారిటీ లేకపోవడం వల్లనే ఆ తీర్మానం నిలబడలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సాక్షిగా మోడీ నెల్లూరు మరియు తిరుపతి సభల్లో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివిగా పరిపక్వతతో వ్యవహరించారనే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని స్పష్టం చేశారు.

మీరు ఇచ్చిన హామీలు ఏంటి, చేసినది ఏమిటి అని ప్రశ్నించారు. పైగా వైసీపీతో వున్న రాజకీయ కారణాల రీత్యా ఇలా చేయవలసి వచ్చిందని తమపై నిందలేయడం ఎంతవరకు న్యాయమని అడిగారు. ఒకవేళ రాబోయే 2019ఎన్నికల్లో తమను సంప్రదించినప్పటికీ కూడా ఇకపై ఎన్డీయే కూటమిలో చేరేది లేదని అన్నారు. ఏదైనా అడిగితే అవినీతి వైసీపీతో ముడిపెడుతున్నారని, అయినా మా ఎంపీలు ఓవైపు ప్రజల సమస్యలపై పార్లమెంట్ లో పోరాడుతుంటే, మరోవైపు కోర్టులో వున్న ప్రతిపక్ష నాయకులతో తమకు పోలికేలేదని చెప్పుకొచ్చారు. ప్రజలపై, ప్రజా సమస్యలపై ఎటువంటి నిబద్దత, విధానం, ఎటువంటి వ్యూహం లేని ఆ పార్టీతో ఇకపై ఎప్పుడు కూడా పోల్చి మాట్లాడవద్దని గట్టిగా నిలదీశారు. ఎన్డీయే నుండి ఎందుకు బయటకు వచ్చారనే విషయమై తనతో ఫోన్ లో సంభాషించిన ప్రధాని మోడీ, తాము వైసిపి వలలో చిక్కుకున్నట్లు చెప్పారని, అయితే ఏ తప్పు చేయనంతవరకు తమకు ఏమికాదని అన్నట్లు చెప్పారు.

గత ఎన్నికల సమయంలో అధికారం చేపడితే అవినీతిని, లంచగొండితనాన్ని అంతమొందిస్తాను అన్న మోడీ గారు, గాలి జనార్ధన రెడ్డి వంటి నాయకులను పెంచి పోషించారని విమర్శించారు. ఈయేపి క్రింద ఏపీకి నిధులు ఇప్పిస్తామని చెప్పిన ఆర్ధిక మంత్రి గారు, అది సాధ్యం కావట్లేదని, మీరు ఒక లేఖ రాసి ఇస్తే నాబార్డు ద్వారా సాయం చేస్తాం అని మాట ఇవ్వలేదా అని గుర్తు చేశారు. ఇక ఇంత జరిగినా విభజన సమస్యలపై గవర్నర్ కానీ, ప్రధాని కానీ, హోమ్ మంత్రి కానీ ఒక్కరు కూడా ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయలేదని, తాము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించడం లేదని, వారి తీరు అసలు ఏమనుకోవాలి మండిపడ్డారు…..

  •  
  •  
  •  
  •  

Comments