యాక్సిడెంట్ లో మృతి.. చార్జీలు వసూలు చేసిన ఉబెర్!

Thursday, July 12th, 2018, 11:25:05 PM IST

మనిషి ప్రాణాలు పోయినా కూడా కొంత మందికి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రముఖ కంపెనీ ఉబెర్ ప్రవర్తించిన తీరు అందరిని షాక్ కి గురి చేసింది. కార్ బుక్ చేసుకున్న పాపనికి ఓ మహిళ ప్రాణాలు పోతే నిర్లక్ష్యం వహించింది కాకుండా చనిపోయిన వారి నుంచి చార్జీలు వసూలు చేశారు. ముంబయిలో జరిగిన ఈ ఘటన ఉబెర్ పై విమర్శలు తెప్పించేలా చేసింది. అసలు వివరాల్లోకి వెళితే..
తాంజిలా షేక్‌ (35) అనే మహిళ గత నెల 14న ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. అయితే ఆ రోజు ఆ కారు ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది.

ఈస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రాంగ్ పార్కింగ్ లో ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో తంజీలా అక్కడే ప్రాణాలు కోల్పోగా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం డ్రైవర్ ను పట్టుకున్నప్పటికీ మరుసటిరోజే బెయిల్ పై విడుదల చేశారు. అయితే ఉబెర్ మరణించిన మహిళ ఎకౌంట్ నుంచి డబ్బును రాబట్టుకోవడం గమనార్హం. ఈ విషయంపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కనీసం ట్రిప్ పూర్తికాకుండానే 568 రూపాయలు మరణించిన మహిళ ఎకౌంట్ నుంచి కట్ చేసుకోవడం సిగ్గుచేటని మహిళ భర్త ముజామ్మిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉబెర్ ని ఈ విషయంపై ప్రశ్నించడంతో డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని తెలిపినట్లు మరణించిన మహిళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments