మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయ్

Wednesday, February 15th, 2017, 01:40:07 AM IST


మహారాష్ట్ర లో మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి అని శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ధాకరే అన్నారు. మహారాష్ట్ర లో బీజేపీ – శివసేన ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుత్నున నేపధ్యం లో త్వరలో జరగబోతున్న బృహన్ ముంబై మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ – శివసేన విడిపోయి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన తరవాత బీజేపీ ప్రభుత్వానికి తాము ఇస్తున్న మద్దతు వెనక్కి తీసుకుంటాం అని ఉద్దావ్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల… 86 శాతం డబ్బు చెలామణిలో లేకుండా పోయిందని మండిపడ్డారు. ఏ మాత్రం ఆలోచన లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని… కానీ, ఆయన ఎలాంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. రామ మందిర నిర్మాణం విషయంలో కూడా ఎలాంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు