గోపాల గోపాల ఆడియో ఫంక్షన్ లో దారుణం

Sunday, January 4th, 2015, 07:07:11 PM IST

gopala-gopala
పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాల. ఈ చిత్రం ఆడియో వేడుక శిల్పకళా వేదికలో జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు కన్నా శ్రీనివాస్ పై కొందరు దుండగులు దాడిచేసి, గొంతుకోసి పరారయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. శిల్పకళావేదిక గెట్ నెంబర్ 1 వద్ద ఈ సంఘటన జరిగింది. వెంటనే గాయపడిన శ్రీనివాస్ ను హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.