ఫ్లాష్ న్యూస్ : ఫేస్ బుక్ కు ఊహించని భారీ నష్టం !!

Tuesday, March 20th, 2018, 04:20:53 PM IST

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కు ఊహించని భారీ నష్టం జరిగింది. వారి షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. నాలుగేళ్లలో ఒకే రోజులో షేర్‌ విలువ అత్యధికంగా పడిపోయింది నిన్ననే. రాజకీయ ప్రయోజనాల కోసం ఫేస్‌బుక్‌ నుంచి దాదాపు 50మిలియన్ల మంది వినియోగదారుల సమాచారం లీకైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ భారీగా నష్టాన్ని చవిచూసింది. వాల్‌స్ట్రీట్‌లో మార్చి 19న ఫేస్‌బుక్‌ షేరు విలువ 7శాతం పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ కు పెద్ద షాకే తగిలింది.

అయితే అది ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం కోసం పనిచేసిన ఓ సంస్థ, 5 కోట్ల మంది వినియోగదారుల ఫేస్ బుక్ డేటాను దుర్వినియోగం చేసిందన్న విమర్శల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే 2014 మార్చి తర్వాత ఒక్క రోజులో ఇంతగా నష్టోవడం ఇప్పుడే. 2014మార్చిలో ఒక్క రోజులో షేరు విలువ 10.8శాతం పడిపోయింది. డేటా అనలిస్ట్‌ కంపెనీ కేంబ్రిడ్జ్‌ అనలిటికా కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి సమాచారాన్ని తీసుకుంది. గత వారంలో ఫేస్‌బుక్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ లాబరేటరీస్‌(ఎస్‌సీఎల్‌), ఫేస్‌బుక్‌కు చెందిన రాజకీయ సమాచార అనలిటిక్స్‌ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటిక్స్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది.

రెండు కంపెనీలు 2015లో సేకరించిన వినియోగదారుల సమాచారాన్ని తొలగించడంలో విఫలమయ్యాయని, ఇది ఫేస్‌బుక్ నిబంధనలకు విరుద్ధమని సంస్థ వెల్లడించింది. దీనివల్ల జుకెర్ బర్గ్ ఒక్కడికే 5.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 వేల కోట్లు) నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఆయన వాటా 16 శాతంగా ఉంది. నష్టం తర్వాత జుకెర్ బర్గ్ సంపద 69.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నెల తొలి వారంలో విడుదల చేసిన ఫోర్బ్స్ రిచెస్ట్ లిస్ట్ లో ఐదోస్థానంలో ఉన్న ఆయన, ఇప్పుడు రియల్ టైమ్ ర్యాంకింగ్స్ లో పదోస్థానానికి పడిపోయారు….