చంద్రబాబు దగ్గర కచ్చితంగా వీక్ నెస్ పాయింట్ ఉంది : మాజీ మంత్రి

Friday, December 1st, 2017, 09:47:28 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీ పాలనలో చాలా లోపాలు ఉన్నాయని విభజన హామీలు ఎందుకు ఇప్పటివరకు నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర నిధుల విషయంలో చాలా నెమ్మదిగా ఉన్నారని చెబుతూ.. చంద్రబాబు వీక్ నెస్ పాయింట్ ఎదో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పారు. అందుకే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేకుండా చాలా నెమ్మదిగా ఉన్నారని మాట్లాడారు. ఇలా వ్యవహరిస్తే చాలా కష్టమని ముఖ్యంగా పోలవరం నిధుల కోసం చాలా ఆలస్యం జరుగుతుందని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి ప్రాజెక్ట్ పనుల కోసం ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మన హక్కు అని విభాజన హామీలను అడగాలని తెలిపారు. ఇకనైనా చంద్రబాబు ఆ విషయాల గురించి ఆలోచించి అభివృద్ధి దిశగా కొనసాగాలని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments