జ‌గ‌న్ నిర్ధోషి.. ఆ కేసులు నిల‌బ‌డ‌వు.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..!

Friday, January 11th, 2019, 11:25:39 AM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా మీడియా ముందుకు వ‌చ్చి రాష్ట్ర రాజ‌కీయాలు, అధికార, ప్ర‌తిప‌క్ష నేతల పై విమ‌ర్శ‌లు చేస్తున్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు, జ‌గ‌న్ , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల పై వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ప‌రిచ‌యం లేక‌పోయినా ఒక మీటింగ్‌కి పిలిచి త‌న‌కు గౌర‌వం ఇచ్చార‌ని, అందువ‌ల‌న ప‌వన్ పై తాను విమ‌ర్శ‌లు చేయ‌న‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు.

ఇక చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. తాను సంధించిన స‌వాళ్ళు స్వీక‌రించ‌లేద‌ని, అభివృద్ధి త‌క్కువ ప్ర‌చారం ఎక్కువ అని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇక జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి బాబు ద‌గ్గ‌ర ఉన్న ఆయుధం ఒక‌టే అని.. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ కోర్టుల చుట్టూ తిర‌గ‌డ‌మేన‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఒక ర‌కంగా అవి జ‌గ‌న్‌కు మైన‌స్సే అని, అయితే ఆ కేసులు, ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని, క్విడ్ ప్రో కోకు సంబంధించి నిల‌బ‌డ్డ కేసులు అస్స‌లు లేవ‌ని, ఎప్పిటికైనా జ‌గ‌న్ నిర్ధోషిగా తేల‌డం ఖాయ‌మ‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. దీంతో ఈ మాజీ ఎంపీ వ్యాఖ్య‌లు మ‌రోసారి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.