జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌లు ఫిక్స్ అయ్యారు.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..!

Tuesday, April 23rd, 2019, 02:37:29 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. గెలుపు ఓట‌ముల పై విశ్లేష‌కులు త‌మ‌దైన అభిప్రాయాలు వ్య‌క్త ప‌రుస్తున్నారు. ప్ర‌ధాన పోటీ టీడీపీ, వైసీపీల మ‌ధ్యే జ‌రిగిన నేప‌ధ్యంలో ఈ రెండు పార్టీ నేత‌లు తామే విజ‌యం సాధిస్తామ‌ని ఎవ‌రికి వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ మ‌రోసారి విజ‌యం త‌మ‌దే అని 140 సీట్లు గెల‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ కూగా అదే ధీమా వ్య‌క్తం చేస్తోంది. ప‌క్కాగా వైసీపీకి 120 స్థానాలు వ‌స్తాయ‌ని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. మ‌రోవైపు జ‌న‌సేన కూడా 80 సీట్ల‌కు పైగా సాధిస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్ర‌భుత్వ డ‌బ్బ‌ను పంచ‌డం మ‌న రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డ చూడ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఈ ఎన్నిక‌ల‌కు రెండు నెల‌లు ముందు ప్ర‌భుత్వ ఖ‌జానా నుండి డ్వాక్రా మ‌హిళ‌ల‌కు 10వేలు ఇచ్చార‌ని, అయితే వారంతా టీడీపీకే ఓట్లు వేస్తార‌ని గ్యారెంటీ లేద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. ఎందుకంటే టీడీపీ ప‌సుపు కుంకుమ ప‌థ‌కంలో మ‌త‌ల‌బును వైసీపీ శ్రేణులు ఎండ‌గ‌ట్టార‌ని, డ్వాక్రా మహిళలకు ఇన్నాళ్ళు వడ్డీ డబ్బులు ఇవ్వకుండా, పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని వైసీపీ చేసిన ప్రచారం కూడా బాగానే ప్రజల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో జ‌నాల్లో వైసీపీ మైలేజ్ ఫుల్‌గా పెరిగిపోయింద‌ని, దీంతో జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు పిక్స్ అయిపోయార‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి చివ‌రిగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి.