చంద్ర‌బాబుకు మైండ్‌బ్లోయింగ్ షాక్.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..!

Friday, November 16th, 2018, 08:39:08 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకి సీబీఐ వ‌చ్చి ఎలాంటి తనిఖీలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ.. టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్రబాబు జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ జీవో పై రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. తాజాగా రాజ‌మండ్రిలో విలేఖ‌రుల‌తో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే సీబీఐ రావాలి అంటూ టీడీపీ సర్కార్ తీసుకువచ్చిన జీఓ టిష్యూ పేపర్‌తో సమానమని.. అది చెల్లదని ఉండవల్లి అన్నారు.

రాజ‌కీయాల్లో 40 ఏళ్ళు అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై సీబీఐ నేరుగా దాడులు చేయవచ్చునని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇక ప్రజా సమస్యల కోసం కోర్టు ఆదేశిస్తే సీబీఐ తప్పనిసరిగా రంగంలోకి దిగుతుందని ఉండ‌వ‌ల్లి చెప్పారు. తాను నిప్పులాంటి నాయ‌కుడని చెప్పుకునే చంద్ర‌బాబు సీబీఐకి భ‌య‌ప‌డ‌డం ఏంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇక ఇలాంటి పిచ్చి జీవోల‌తో చంద్రబాబు రాష్ట్ర పరువు తీస్తున్నారని.. దీంతో చంద్ర‌బాబు వెంట‌నే ఆ జీవోను ర‌ద్దు చేసుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. దీంతో ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.