జైపాల్‌రెడ్డికి ఉండ‌వ‌ల్లి స‌వాల్

Saturday, September 24th, 2016, 09:04:22 AM IST

undavali
మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్- మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదాలున్నాయి. స‌మ‌యం దొరిక‌న‌ప్పుడ‌ల్లా ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుతూనే ఉంటారు. పైగా రెండు మూడు రోజుల నుంచి ఆ స్పీడ్ మ‌రీ ఎక్కువైంది. తాజాగా జైపాల్ కు ఉండ‌వ‌ల్లి పెద్ద స‌వాల్ విసిరారు. రాష్ట్ర విభ‌జ‌న‌ స‌మ‌యంలో నేను రాసిన పుస్త‌కం త‌ప్పు అయితే ఆ త‌ప్పేంటో, అస‌లు నిజాలేంటో చెప్పాల‌ని ఉండ‌వ‌ల్లి జైపాల్ కు స‌వాల్ విసిరారు.

అప్ప‌ట్లో స్పీక‌ర్ చాంబ‌ర్‌లో సుష్మాస్వ‌రాజ్, క‌మ‌ల్ నాథ్ మ‌ధ్యా రాజీ కుదుర్చాన‌ని మీరే చెప్పారుగా..అందులో అసలు నిజ‌మేంటో ఇప్ప‌టికైనా బ‌య‌ట పెట్టండ‌ని డిమాండ్ చేశారు. రాజ్య‌స‌భ‌లో చిరంజీవి వెల్ లో ఉండ‌గా ఓటింగ్ ఎలా నిర్వ‌హించారు? విభ‌జ‌న బిల్లు పాస్ అవ్వ‌లేద‌ని, కాంగ్రెస్, బీజేపీ క‌లిసినా మెజారిటీ లేక‌పోవ‌డం.. ఓటింగ్ ఏదీ లేద‌ని జైపాల్ స‌ల‌హా ఇచ్చార‌ని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు. ఇప్ప‌డు అధికారం లో ఎలాగూ లేరు కాబ‌ట్టి ఇప్ప‌టికైనా నిజాలు బ‌య‌ట‌పెడితే బాగుంటుంద‌ని డిమాండ్ చేశారు. లోలోప‌ల జ‌రిగే అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు నేరుగా చూడ‌లేక‌పోయినా వాస్త‌వాలేంటో వాళ్ల‌కు బాగా తెలుస‌ని అన్నారు.