చంద్ర‌బాబు గెలుపుపై ఉండ‌వ‌ల్లి జోష్యం

Friday, January 11th, 2019, 11:10:32 AM IST

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ మ‌ట్టిక‌ర‌వ‌డం ఖాయ‌మేనా?. ఈ ద‌ఫ చంద్ర‌బాబును గ‌ట్టెక్కించ‌డం క‌ష్ట‌మేనా?. ఎవ‌రితో పొత్తుపెట్టుకున్నా బాబు గెలుపు అన్న‌ది అసాధ్య‌మేనా? బఆబు గెల‌వాలంటే ఏదో అద్భుతం జ‌ర‌గాల్సిందేనా? ప‌్రస్తుత ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తున్న మాట‌లివి. వీటికి ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చంద్ర‌బాబు గెలుపుపై చెప్పిన జోష్యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీ రాజ‌కీయాల‌పై, చంద్ర‌బాబు భ‌వితవ్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు గెల‌వ‌డం ఆసాధ్య‌మ‌ని, అయినా త‌న గెలుపుకోసం చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ బాబు చేస్తాడ‌ని చిద‌రికి ఫ‌లితం శూన్య‌మ‌ని తేలుతుంద‌ని చుర‌క‌లంటించాడు. ఇక ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతాడ‌ని గంఠాప‌థంగ చెప్పిన ఆయ‌న జ‌గ‌న్ పాత్ర యాత్ర విజ‌య‌వంత‌మైంద‌ని రానున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పారు. ఇక జ‌న‌సేనాని గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేసిన ఉండ‌వ‌ల్లి ఆయ‌న‌కు మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కాల‌నే ఆలోచ‌న లేద‌ని, ఆ విష‌యాన్ని ప‌వ‌న్ నాతో చెప్పార‌ని కొత్త మాట బ‌య‌ట పెట్టారు.

గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డం వ‌ల్ల గెలుపందాల్సిన జ‌గ‌న్ స్వ‌ల్ప తేడాతో అధికారాన్ని అందుకోలేక‌పోయాడ‌ని, ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగిన ద‌రిమిలా అతి జ‌గ‌న్‌కు బాగా క‌లిసివ‌స్తుంద‌ని, త‌ద్వారా ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ఖావ‌డం ఖాయంగా క‌నిపిస్తోందిన త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.