చంద్ర‌బాబు పై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కేవ‌లం దానికోసం 20వేల కోట్లా..?

Tuesday, October 9th, 2018, 12:59:26 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై సీనియర్ నేత మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అస‌లు మ్యాట‌ర్ లోకి వెలితే.. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో తాజాగా విలేఖ‌రుల‌తో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబు చేసిన దుబారా ఖ‌ర్చుల పై పూర్తి ఆధారాల‌తో మ‌రోసారి విరుచుకుప‌డ్డారు.

ఈ నేప‌ధ్యంలోనే చంద్ర‌బాబు చేసిన 20 కోట్ల దుబారా ఖ‌ర్చును బ‌య‌ట పెట్టారు. ఒక‌వైపు రాష్ట్రం కొత్త‌గా ఏర్ప‌డి అప్పుల్లో ఉంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టును చూపించ‌డానికి వివిధ ప్రాంతాల నుండి ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్ళ‌డానికి 20 కోట్ల ప్ర‌జా ధనాన్ని వృధా చేయ‌డం చాలా దారుణ‌మ‌ని ఉండ‌వ‌ల్లి ఫైర్ అయ్యారు. అంతే కాకుండా నేచుర‌ల్ ఫార్మింగ్ జీరో బ‌డ్జెట్‌తో చేయ‌వ‌చ్చు అని చెప్పి.. ఆ తర్వాత ప‌ద‌హారువేల ఆరువంద‌ల కోట్లు ఎంవోయూను.. సిఫ్ సంస్థ‌తో చంద్ర‌బాబు ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పాల‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.

మ‌న దేశం మొత్తం మీద వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 20 శాతం.. ఏపీకే వచ్చిందని, దాదాపుగా 18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయనే విష‌యాన్ని.. గతంలో స్వ‌యంగా చంద్రబాబే ప్రకటించారని.. అయితే ఆ పెట్టుబ‌డుల‌కు సంబంధించి శ్వేతపత్రం ప్రకటించాల‌ని… చంద్ర‌బాబు ఇక‌నైన ప్ర‌జ‌ల‌కు నిజాలు చెబితే మంచిద‌ని… అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నిత్యం మ్యానేజ్ చేస్తూనే ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నారని.. ప్ర‌జ‌ల‌కు అంతా అర్ధ‌మ‌వుతోంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల త‌గిన బుద్ధి చెబుతార‌ని ఉండ‌వ‌ల్లి ఫైర్ అయ్యారు. మ‌రి ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.