రాష్ట్రం బాగుపడాలంటే అదే చేయండి.. ప్రజలకు ఉండవల్లి సలహా

Wednesday, April 11th, 2018, 03:50:17 AM IST

వచ్చే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు డబ్బులు పంచడానికి రెడీ అవుతున్నాయని సీనియర్ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర పరిస్థితుల గురించి అలాగే పార్టీల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రతి పక్ష పార్టీ వల్లే ఈ వైఫల్యాలు అని ఏ అధికార పార్టీ అయినా చెప్పిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు డబ్బులు పంచడానికి రెడీగా ఉన్నట్లు కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రతి ఓటర్‌ కి రెండు వేల రూపాయలు ఇచ్చే వారికే పార్టీలో టిక్కెట్లు దక్కుతాయని, ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉంది కావున ఆ పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థికి ఒక ఓటు కోసం రూ.1000 పార్టీ తరపు నుంచి వస్తాయి. మరొక 1000 సొంతంగా ఖర్చు పెట్టుకోవాలనే విధంగా పరిస్థితులు ఉంటాయన్నారు. ఈ సందర్బంగా ఉండవల్లి ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలిపారు. డబ్బు ఖర్చు పెట్టె వ్యక్తిని ఓడించాలని చెబుతూ.. డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఏ మాత్రం ఓటు వేయకూడదని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments