ఉద్యోగం దొరకట్లేదు అనే బాధతో…..

Wednesday, September 12th, 2018, 06:46:05 PM IST

గడుస్తున్న రోజుల్లో తమ చదువును పూర్తి చేసి వారి చదువు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏదొక ఉద్యోగం చేసుకొని వారి తల్లిదండ్రులను పోషించుకుందాం అనుకున్నా సరే ఉద్యోగం ఇచ్చే నాధుడే కరువయ్యాడు. తాను ఎదుగుతున్న కొద్దీ వారి తల్లి తండ్రులకు భారం కాకూడదు అని వారిని ఆనందం చూసుకోవాలి అని ప్రతీ కొడుకు లేదు కూతురు అనుకుంటారు. ఐతే వారు సాయశక్తులా వారు వంతు ఏంతో ప్రయత్నం చేసినా సరే ఉద్యోగం దొరకట్లేదు. దానితో చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నిరుద్యోగం వలన ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే కొంత మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి అక్కడే బీటెక్ వరకు చదివాడు. చదువు పూర్తయ్యాక గడిచిన నాలుగేళ్లలో ఎన్నో ఉద్యోగాల వేటలో పడ్డాడు కానీ ఎవరికీ కనికరం కలగలేదు. దానితో తాను తన తల్లితండ్రులకు భారం కాకూడదు అనుకున్నాడేమో. తనంతట తాన నిప్పు అంటించుకొని ఆత్మాహుతి చేసుకొని ప్రాణాలు విడిచాడు. దీనికి కారణం ఒక రకంగా ప్రభుత్వం కూడా అవుతుంది. మన రాష్ట్రం లో ఎప్పటి నుంచో ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు దానితో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువయ్యిపోయింది దీనితో చాలా మంది యువత ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments