మ‌హాసంగ్రామం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కి.. ఊహించ‌ని షాక్..?

Friday, December 7th, 2018, 12:00:20 AM IST

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ల‌గ‌డ‌పాటి స‌ర్వే లీక్స్ అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 7న త‌న స‌ర్వే విడుద‌ల చేస్తాన‌న్న ల‌గ‌డ‌పాటి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ కొన్ని లీకులు ఇచ్చి, రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేక‌త పెరిగిపోయింద‌ని, న‌వంబ‌ర్ వ‌ర‌కు బాగానే ఉంద‌ని, ఎప్పుడైతే మ‌హాకూట‌మి ఏర్ప‌డిందో అప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మీక‌ర‌ణాలు మారిపోయాయ‌ని, దీంతో ప్ర‌జాకూట‌మికే అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌నే సంఖేతాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డానికి తీవ్రంగా శ్ర‌మించారు.

అయితే ఈ నేప‌ధ్యంలో ల‌గ‌డ‌పాటికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. తెలంగాణ‌లో చివ‌రిరోజు ప్ర‌చారంలో ల‌గ‌డ‌పాటి స‌తీమ‌ణి లగడపాటి పద్మ టీఆర్ఎస్ కండువా క‌ప్పుకుని, ఆ పార్టీ అభ్య‌ర్ధి దానం నాగేంద‌ర్‌కు అనుకూలంగా ఖైర‌తాబాద్‌లో ప్రచారం చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి ప‌ద్మ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేయలేదని.. కనీసం పదేళ్లు అవకాశం ఇస్తే పెండింగ్‌లో ఉన్న‌ పనులన్నీ పూర్తవుతాయని ల‌గడపాటి పద్మ అన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా టీఆర్ఎస్ పార్టీనే గెల‌వ‌నుంద‌ని, తాను కూడా ఆ పార్టీనే గెల‌వాల‌ని కోరుకుంటున్నాని స్ప‌ష్టం చేశారు. అయితే ఒక‌వైపు ల‌గ‌డ‌పాటి ఏమో మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇన్‌డైరెక్ట్‌గా చిల‌క జ్యోస్యం చెబుతున్నారు. దీంతో ఆయ‌న స‌ర్వే ఇంట్లో వాళ్ళే ప్ర‌భావితం కావ‌డం లేదు.. మ‌రి ఏ అంచ‌నా ప్ర‌కారం ల‌గ‌డ‌పాటి స‌ర్వే చేశారో ఆయ‌న‌కే తెలియాలి. ఏది ఏమైనా ప్ర‌స్తుతం తెలంగాణ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఒక వారం రోజులుగా హ‌డావుడి చేస్తున్న ల‌గ‌డ‌పాటికి ఆయ‌న భార్య నుండే ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్ఆన‌రు.