డేంజ‌ర్‌: పాల ప్యాకెట్లు తాగితే అబ్బాయిలే అమ్మాయిలుగా?

Thursday, February 23rd, 2017, 12:20:26 AM IST


పీల్చే గాలి క‌ల్తీ. నీళ్లు, కారం, నెయ్యి, ఉప్పు, పొడులు .. ప్ర‌తిదీ క‌ల్తీయే. ఇక నిత్య ం న‌గ‌ర‌వాసులు వేకువ‌ఝామునే తాగే టీ, కాఫీలు క‌ల్తీనే. టీ, కాఫీ పొడులు క‌ల్తీవి. అంతేనా? అందులో క‌లిపే పాలు కూడా ప‌క్కా క‌ల్తీ. ఈ పాల‌లో విష ర‌సాయ‌నాలెన్నో. పాల‌పొడుల్ని పాలుగా మార్చి దుకాణం వాడు అమ్మేస్తాడు. ఆ పాల‌పొడుల‌న్నీ విష‌పూరిత రసాయ‌నాల‌తో త‌యార‌య్యేవేన‌న‌డానికి ప‌లు ఆధారాలున్నాయి. అయితే ఈ దందా అక్క‌డితో ఆగిపోలేదు.

పాపాల భైర‌వులు పాల‌ను క‌ల్తీ చేసేస్తున్నారు. ఆవులు, గేదెల‌కు ఆక్సిటోసిన్ ఇంజెక్ష‌న్లు చేయడం ద్వారా పాలు అధికంగా పితకాల‌నే దుర్మార్గానికి తెగ‌బ‌డుతున్నారు. తాజాగా హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో పాల‌ను క‌ల్తీ చేసే పెద్ద మాఫియా గ్యాంగ్ పోలీసుల‌కు చిక్కింది. అబ్ధుల్ ఖ‌లీద్ అనే వాడు ఈ మాఫియాని ర‌న్ చేస్తున్నాడు. ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా మొద‌లై సిటీలోని అన్నిచోట్ల‌కు పాల వ్యాపారుల్ని పంపించి విషాన్ని చ‌ల్లేస్తుంటాడు వీడు. ఇప్ప‌టికే మీరు కూడా బాధితుడే అయి ఉంటారు మ‌రి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఈ పాలు తాగితే గ‌ర్భిణుల‌కు అబార్ష‌న్ అవుతుంది. అబ్బాయిల‌కు అమ్మాయి ల‌క్ష‌ణాలు వ‌స్తాయిట‌. అంతేకాదు ఇంకా చాలా దుష్ప‌రిణామాలు ఉన్నాయి. అయితే ఇంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన ఆక్సిటోసిన్ ఇంజెక్ష‌న్లు ఎక్క‌డ తయార‌వుతున్నాయి? ఎట్నుంచి వ‌స్తున్నాయి? అన్న ఆరా మొద‌లెట్టారు పోలీస్‌. అంటే దీనివెన‌క ఫార్మా కంపెనీల దందా కూడా బ‌య‌ట‌ప‌డుతుందేమో చూడాలి.