అత్యాచారంచేస్తే మరణ దండనే!

Sunday, April 22nd, 2018, 10:48:57 PM IST

 

దేశ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని ముందుకు తీసుకురాబోతోంది. నిర్భయ ఘటన తరువాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఇంకా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండడానికి శిక్షలు కఠినం చేయాలనీ దేశ నలువైపులా సామాన్యులు ఆందోళనలు చేస్తున్నారు. కథువా ఘటన తరువాత కేంద్ర మంత్రివర్గం శనివారం కీలకమైన అత్యవసరాదేశాలకు (ఆర్డినెన్సులకు) ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల బాలికపై అత్యచారం చేస్తే వారికి ఉరిశిక్ష విధించాలని అందరు నిర్ణయం తీసుకున్నారు. అందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

అంతే కాకుండా ఇతర ఘటన విషయాల్లో కూడా శిక్షా కాలాన్ని పెంచనున్నారు. ఇతర అత్యచారా ఘటనల్లో జీవిత కాలం శిక్ష పడేలా చట్టాలను సవరించారు. అత్యాచార ఘటనల విచారణలు రెండు నెలల్లో పూర్తయ్యే విధంగా పోలీసు దర్యాప్తు, కోర్టులకు ఆదేశాలు వెళ్లాయి. ఘటన జరిగిన తరువాత వీలైనంత త్వరగా స్పందించే విధంగా విచారణలు జరగాలి. కోర్టులు అలాగే ప్రాసిక్యూషన్‌ వ్యవస్థను బలోపేతం కానున్నాయి. పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులకు స్పెషల్ గా ఫోరెన్సిక్‌ కిట్లు అందనున్నాయి. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు టెక్నాలిజీని ఎక్కువగా వాడనున్నారు.

లైంగిక నేరాలకు శిక్షలు:

12 ఏళ్ల లోపు ఉండే బాలికలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష, లేదంటే మరణించే వరకు జైల్లోనే.

16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిళ్లు ఇవ్వకూడదు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెయిల్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకొనే ముందు కోర్టు బాధితురాలి ప్రతినిధులకు 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి.

16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు శిక్షను పెంచారు. లేదంటే మరణించే వరకు పొడిగించవచ్చు.

అప్పీళ్లపై ఉన్నత న్యాయస్థానాలు వీలైనంత త్వరగా ( ఆరు నెలల్లో) నిర్ణయం తీసుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments