షాకింగ్ న్యూస్ : పవన్ ఫామ్ హౌస్ దగ్గర్లో మహిళ ధారుణ హత్య

Saturday, October 6th, 2018, 08:00:35 AM IST

జనసేన పార్టీ అధినేత , ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి దగ్గర్లో గుర్తు తెలియని మహిళ ధారుణ హత్యకి గురైంది. ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలోని శంకర పల్లి మండలం జన్వాడ గ్రామ శివార్లలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు … అయితే అక్కడ నివశిస్తున్న స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ హత్య వారం క్రితం రోజుల కిందట జరిగి ఉండవచ్చని , మరియు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు… అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు …

అయితే ఇది ఇలా ఉండగా పోలీసులు ఈ కేసుని దహర్యాప్తు చేసే పనిలో ఉన్నారు … కాగా అందులో బాగం గా అసలు ఇంతకీ ఆ మహిళ ఎవరు ? అక్కడ ఎందుకు హత్య కి గురైంది …. అసలు ఆమెను ఇంత కిరాతకం గా చంపాల్సిన అవసరం ఎవరుకుంది . అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అంతేగాక ఫామ్ హౌస్ కి దగ్గర్లో ఉన్న నిఘా కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం …. అయితే ఈ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది …