అపూర్వ కలయిక- అంచనాలు దొరకట్లేదు

Thursday, January 10th, 2019, 07:19:42 PM IST

చాలా గ్యాప్ తరువాత బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ మళ్ళీ మున్నాభాయ్ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారు. గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న సంజయ్ దత్, మళ్ళీ మున్నాభాయ్ 3 గా రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో మన మెగా స్టార్ చిరంజీవి శంకర్ దాదా గా తీసిన సంగతి మనకి తెలిసిందే. అవి ఎంతలా హిట్ అయ్యాయో కూడా మనకి తెలుసు. కానీ ఇప్పుడు హిందీ లో రాబోతున్న మున్నాభాయ్ 3 ని తెలుగులో తీయడానికి మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను సంజయ్ దత్ కలవడం పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు వీరందరూ కలిశారు.. అని సినీ పరిశ్రమలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ దత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాను సెట్ చేస్తున్నారని, ఆ సినిమాకు రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ నిజా నిజాలు బయటకు వచ్చేదాకా ఎం చెప్పలేము.