సీత టెస్ట్ ట్యూబ్ బేబీ.. రామాయణంలో మొదలైంది: బీజేపీ నేత

Friday, June 1st, 2018, 06:12:33 PM IST

ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న కొత్త కొత్త టెక్నాలిజీ అప్పట్లోనే పుట్టిందని చాలా మంది చెబుతుంటారు. పురాణాలూ తిరగేసి చుస్తే చాలా వరకు ఇప్పుడున్న పద్ధతులు అప్పుడే మొదలయ్యాయని కొంత మంది హిందూ పండితులు చెబుతుండడం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అదే తరహాలో ఈ మధ్య ఎక్కువగా చెబుతుండడం వైరల్ గా మారింది. రీసెంట్ జర్నలిజం – లైవ్ టెలిక్యాస్ట్ అప్పటి మహాభారతంలోనే ప్రారంభం అయ్యాయని తెలిపిన బీజేపీ నేత దినేశ్‌ శర్మ ఇప్పుడు టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ రామాయణంలో మొదలయిందని తెలిపారు.

రామాయణ కాలం గురించి ఓ మీటింగ్ లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి.. సీతమ్మ మట్టి కుండలో పుట్టడం గమనిస్తే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలు ఆ కాలంలోనే ప్రారంభమయ్యాయని అనుకోవచ్చని తెలిపారు. మన పెద్దలు చెప్పిన విధానం ప్రకారం సీతమ్మ మట్టి కుండలో పుట్టారనేది వాస్తవమని అదే టెస్ట్ ట్యూబ్ బేబీ తరహా విధానమని బీజేపీ నేత వివరించడం ఇప్పుడు వైరల్ గా మారింది. కొన్ని రోజుల క్రితం మహాభారతం గురించి మాట్లాడుతూ.. లైవ్ తెలిక్యాస్ట్ అంటే కురుక్షేత్రం గురించి హస్తినాపురంలో ఉన్న సంజయుడు ఏప్పటికప్పుడు దృతరాష్ట్రుడికి వివరించడమే అని ఇటీవల చెప్పారు. అదే విధంగా నారదుడిని ఆయన జర్నలిస్ట్ తో కూడా పోల్చారు.

  •  
  •  
  •  
  •  

Comments