మహేష్ బాబు సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ హీరో..!

Thursday, March 14th, 2019, 01:55:35 AM IST

స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా సరే కాదనలేరు కానీ, ఈ సీనియర్ హీరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.అతను రిజెక్ట్ చేసింది మరెవరి సినిమానో కాదు మహేష్ బాబు సినిమాని, ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరంటే కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో తనదైన విభిన్న నటనాశైలితో ప్రత్యేకత చాటుకున్న ఉపేంద్ర . ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రకోసం ఉపేంద్రను సంప్రదించగా, ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట.

ఆ పాత్రలో ఉపేంద్ర అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించి అనిల్ రావిపూడి ఉపేంద్రను కలిసి కథ చెప్పగా . మొత్తం విన్నాక మీ సినిమాలో నటించలేను అని చెప్పాడట ఉపేంద్ర. దాంతో అవాక్కయిన అనిల్ కారణం అడుగగా “నా దగ్గర ఇప్పుడు డేట్స్ ఖాళీ లేవు” అని సమాధానం ఇచ్చాడట .