యుఎస్ ఓపెన్ పురుషుల టైటిల్స్ లియాండర్ పేస్ జోడి

Monday, September 9th, 2013, 01:37:43 PM IST

us-champiyans
భారత డబుల్స్ స్టార్ ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరింది. యుఎస్ ఓపెన్ పురుషుల టైటిల్స్ లో రాడెక్ స్టేపెనేక్(చెక్), లియాండర్ పేస్ లు రెండో సీడ్ అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రేలియా), బ్రునో సోరెన్ (బ్రెజిల్) జోడితో ఆదివారం జరిగిన పోరులో 6-1, 6-3 తేడాతో ఓడించారు. అత్యంత ఏకపక్షంగా సాగిన ఈ పోరులో విరి దాటికి ప్రత్యర్దులు కనీస పోటిని కూడా ఇవ్వలేకపోయారు. నలబై సంవత్సరాలు ఉన్న లియాండర్ పేస్ ఇప్పటి వరకు ఏడు సార్లు యుఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్ ఆడాడు. ఇప్పటి వరకు పేస్ మూడు టైటిల్స్ ని గెలుచుకున్నాడు. అతను 2006, 2009, 2013లో టైటిల్స్ గెలుచుకున్నాడు.