యూఎస్ ప్రీమియర్ షో టాక్: మహానటి ఎలా ఉందంటే?

Wednesday, May 9th, 2018, 01:07:05 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటిసారిగా ఒక మంచి సినీ తార బయోపిక్ తెరకెక్కడం గొప్ప విషయమని చెప్పాలి. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను అశ్విని దత్ ప్రొడక్షన్ వారు నిర్మించారు. అయితే కొన్ని గంటల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందంటే..

సావిత్రి జీవితం అనగానే ముందుగా అలనాటి వాతావరణం తెరపై కనిపించాలి. ముందు ప్రేక్షకుడు ఆ మూడ్ లోకి వెళ్లాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చిన్న తనం నుంచి సావిత్రి పాత్రను తీర్చి దిద్దిన విధానం ఓవరాల్ గా మంచి కాన్సెప్ట్. ఆమెకు సంబందించిన 11 చిత్రాల షూటింగ్ లను చూపించిన విధానం కూడా మరో హైలెట్. అలనాటి తారలు కనిపించిన తీరుకు ప్రేక్షకుల్లో తప్పకుండా ఒక చిరునవ్వు కలుగుతుంది. ముఖ్యంగా కీర్తి సురేష్ తన పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి. మహానటి పాత్రకు ఆమె న్యాయం చేసిందని చెప్పవచ్చు.

అయితే మధ్యలో కొన్ని సన్నివేశాలు కథ మూడ్ ని డైవర్ట్ చేసే విధంగా ఉంటుంది. కథ మొత్తం సమంత – విజయ్ దేవరకొండ తో సాగుతుంటుంది. సావిత్రి గురించి వారి అన్వేషణ సినిమాకి ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో సినిమా కంటతడి పెట్టిస్తుంది. అప్పట్లో షూటింగ్స్ జరిగిన విధానం కొత్తగా అనిపిస్తుంటుంది. చాలా ఆసక్తిగా కూడా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో ప్రతి ఒక్కరు చాలా గొప్పగా నటించారు. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేము గాని సావిత్రి జీవితం గురించి అలాగే అప్పట్లో సినీ తారల జీవితం గురించి తెలుసుకోవాలని ఉంటె ఈ సినిమా చూడవచ్చు. ఎలాంటి అంచనాలతో వెళ్లకుండా సింపుల్ గా ఫ్రెష్ మైండ్ తో సినిమా చుస్తే తప్పకుండా అందరికి నచ్చుతుంది.