హెచ్-4 వీసాదారులకు యుఎస్ఏ ప్రభుత్వం ఊరట!

Sunday, May 20th, 2018, 09:50:06 PM IST

ప్రస్తుతం ట్రంప్ అధికారం చేపట్టాక ఇప్పటికే అమెరికన్ ప్రభుత్వం తరపున అయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలుదేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అక్కడ నివసిన్చేవారిలో భారతీయులు కూడా చాలా అధికంగా వున్నారు. 2015లో ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం హెచ్1-బి విశాలపై అమెరికాకు వలసవచ్చే వారి జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించేలా బిల్లు తీసుకొచ్చారు. కొన్నాళ్ల క్రితం ట్రంప్ హెచ్-4 వీసా ఉద్యోగార్ధుల ఉద్యోగ అనుమతులు రద్దుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఆయన తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంపై అక్కడి స్థానిక భారతీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా అమెరికన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ కాంగ్రెస్సిరల్ రీసెర్చ్ సర్వీసెస్ నివేదిక ప్రకారం జారీ చేసిన వీసాల్లో దాదాపు 93% భారతీయులవేనని, మరొక 5% చైనా వారివని తెలిపింది. మనదేశం వారి వీసాల్లో 93% మంది మహిళలేనని తెలుస్తోంది. ఇక మొత్తంగా వున్న 93% మంది వీసాదారుల్లో దాదాపు 5వంతు మందికిపైగా కాలిఫోర్నియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో టెక్సాస్, న్యూ జెర్సీ వున్నాయి. అంటే దాని ప్రకారం మొత్తం 1,26,853 మందికి అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఆమోదం తెలపడం జరిగింది. కాగా ఇంత మంది ఉద్యోగుల ఉపాధిని ఎత్తివేయాలనడంతోనే అక్కడ వ్యతిరేకత ప్రారంభం అయింది.

ఇండో అమెరికన్ శాసన కర్త అయిన ప్రమీల జైపాల్, 130 మంది కాంగ్రెస్ సభ్యులతో సహా హెచ్-4 విసదారుల ఉద్యోగ అవకాశాలను ఎత్తివేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ ని విన్నవించారు. అయితే ఈ విషయమై ట్రంప్ ప్రభుత్వం లోని అధికారి ఒకరు స్పందిస్తూ హెచ్ 1-బి విసదారుల జీవిత భాగస్వాముల హెచ్-4 ఉద్యోగ నిబంధనలను ఇప్పట్లో ఎత్తివేశే అవకాశం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో అక్కడి స్థానిక భారతీయుల ఆనందాలకు అవధులు లేకుండాపోయాయి. తమపట్ల విధేయతతో వ్యవహరించిన ట్రంప్ ప్రభుత్వానికి మన వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments