యాషెస్ సమరం ఆరంభం

Wednesday, July 10th, 2013, 11:00:59 PM IST


ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం ఆరంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 33 ఓవర్లలొ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. బెల్ 4 పరుగులతోను,ట్రాట్ 43 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు . వరుసగా రెండుసార్లు యాషెస్ గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. ఈసారి స్వదేశంలోను సత్తా చూపాలని కసిగా ఉంది.మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఆసీస్.. యాషెస్ విజయం ద్వారా స్వదేశంలో అభిమానుల మనసులు గెలవాలని ఆశిస్తోంది.