కేసీఆర్‌పై ఉత్త‌మ్‌ విమ‌ర్శ‌ల్లో వాస్త‌వ‌మెంత‌?

Sunday, April 29th, 2018, 10:54:22 PM IST

సిఎం కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తెలను ఆంధ్రులకు సంచులు మోస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర‌య్యారు. కేసీఆర్ కుటుంబం ఆంధ్రులకు సంచులు మోయకపోతే ఇప్పటి వరకు ఇచ్చిన కాంట్రాక్టుల్లో 95 శాతం ఆంధ్రులకే ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. నాలుగు సంవత్సరాల్లో రూ.6,75,000 కోట్ల బడ్జెట్, మరో రూ.2,00,000 కోట్ల అప్పులతో రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారని ఉత్తమ్ నిలదీశారు. నేటి తరాన్నే కాక భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి పౌరునిపై రూ.63,000 అప్పు మోపారన్నారు. ప్రజలు కడుతున్న పన్నులను అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధి దయవల్లనే కేసీఆర్ సిఎం కాగలిగారన్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం, బలహీనవర్గాలకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లింపులు, డబుల్ బెడ్ రూమ్, దళితులకు లోన్ కమ్ సబ్సిడీ, మూడెకరాల భూమి పంపిణీకి డబ్బులు కేటాయించలేని సిఎంకు విలాసవంతమైన ఇల్లు అవసరమా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రులు క్యాంపు కార్యాలయానికి వచ్చే అందరిని కలిసే వారని, అయితే కేసీఆర్ మాత్రం ఎవ్వరినీ కలవడం లేదన్నారు. ముఖ్యమంత్రి సామాన్యుడిలా బ‌తకలేడా అని ఆయన ప్రశ్నించారు. దొంగ వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిత్వం లేని ప్రవర్తన కలిగిన వారు తనను విమర్శించడం పట్ల ఉత్తమ్ బాధను వ్యక్తం చేశారు. అయితే ఉత్త‌మ్ చేసిన విమ‌ర్శ‌ల్ల కొన్ని వాస్త‌వాలు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు. కేసీఆర్ త‌న‌కు అత్యంత ఆప్తులైన ఏపీ నేత‌ల‌కు కాంట్రాక్టులు అప్ప‌జెప్పార‌న్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం ఉంది. రైతుల విష‌యంలోనూ కేసీఆర్ చేస్తున్న ప‌నుల్లో క్లారిటీ మిస్స‌య్యింది. ఫీజు రీఇంబ‌ర్స్‌మెంట్‌, కేజీ టు పీజీ ఇక్క‌డ అట‌కెక్కాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments