బ‌ట్టేబాజ్‌.. ని ఆడేసుకుంటున్నారే!?

Sunday, October 7th, 2018, 11:07:40 AM IST

సందు దొరికింది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే త‌రువాత చెవులు మూసుకోక త‌ప్ప‌దు. ఇప్పుడు అదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడు టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి. ఇటీవ‌ల నిర్వ‌హించిన టీపీసీసీ శంఖారావ స‌భ‌లో కేసీఆర్ ను బ‌ట్టేబాజ్ అని ఉత్త‌మ్ తిట్ల పురాణం అందుకున్న విష‌యం తెలిసిందే. ఉక్క‌డే ఆయ‌న అడ్డంగా టీఆర్ ఎస్‌ శ్రేణుల‌కు దొరికిపోయాడు. దీంతో ఉత్త‌మ్‌ను ఆడుకోవ‌డం షురూ చేశారు. ముందుగా త‌ల‌సాని ఉత్త‌మ్ బండార‌న్ని బ‌య‌ట‌పెట్టి తిట్ల పురాణం అందుకున్నాడు.

ఉత్త‌మ్‌ సైనికుడు..అదంతా బ‌ల్డ‌ప్పే..బార్డ‌ర్ లో సైనికుడు కాద‌ట‌. డిఫెన్స్‌లో సాధార‌ణ ఉద్యోగి మాత్ర‌మేన‌ట‌. అక్క‌డి నుంచి బ‌య‌టికొచ్చిన ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఉద్యోగం సంపాదించాడ‌ని, రాజ‌కీయ నేత‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌డంతో పైర‌వీలు చేయించుకుని ఎమ్మ‌ల్యే టికెట్ పొందాడ‌ని..ఇప్పుడొచ్చి బోర్డ‌ర్‌లో ప‌హారా కాసాన‌ని బిల్డ‌ప్ ఇస్తున్నాడ‌ని ఉత్త‌మ్ ను టీఆర్ ఎస్ మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ఏకిపారేశాడు. ఉత్త‌మ్ వ‌న్నీ బ‌ట్టేబాజ్ మాట‌లేన‌ని, కాంగ్రెస్ బ‌ట్టేబాజ్‌ల ఇళ్ల‌ల్లో క‌రెంట్ వ‌స్తుందో లేదో చెప్పాల‌ని స‌వాల్ చేశాడు.

ఇంటికో ఉద్యోగం ఇమ్మ‌ని చెబుతున్నాడు. సిటీలో కోటి ఇల్లున్నాయి. అలా అయితే కోటి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? ఉత్త‌మ్‌వి, వారి ముఠాయి బ‌ట్టేబాజ్ మాట‌లు కాక‌పోతే మ‌రేమిటి. కాంగ్రెస్‌లో అంద‌రూ దొంగ‌లే. వాళ్ల‌లో యూనిటీ అనేదే లేఉ. రాదు. అలాంటి దొంగ‌ల మాట‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కేసీఆర్ పాల‌న‌లో స‌బ్బండ వ‌ర్ణాలు సంతోషంగా వున్నాయి. కాంగ్రెస్ వారి సంతోషాన్ని చూసి ఓర్వ‌లేక‌పోతున్నాయి. అని త‌ల‌సాని చ‌ర‌క‌లు అంటున్నాడు. దీనిపై ఉత్త‌మ్ అండ్ కో ఎలాంటి స‌మాధానం చెబుతుందో..ఎలాంటి దాడికి దిగుతుందో చూడాలి.