ఉత్త‌మ్.. కాన్ఫిడెంటా? ఓవ‌ర్ కాన్ఫిడెంటా?

Wednesday, October 24th, 2018, 09:20:21 AM IST

మీరు ప‌ళ్లు తోముకునే ప‌నిలేదు…అవ‌కాశం ఇస్తే మీ ప‌ళ్లు మేమే తోమేస్తాం. మీరు సోపు పెట్టుకోన‌వ‌స‌రం లేదు.. మీ వీపు మేమే తోపేస్తాం.. అంటూ తమ ప్రొడ‌క్ట్ మార్కెట్ చేసుకోవ‌డం కోసం కంపెనీలు మాట‌ల గార‌డీ చేస్తుంటాయి. ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు తీరు కూడా అలాగే వుంది. తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ నాయ‌కుడిదీ ఇదే తీరు. మ‌మ్మ‌ల్ని గెలిపిస్తే మీ ఇంటికి క‌న్నాల‌తో పాటు సున్నాలు మేమే వేస్తాం. తేర‌గా తిని ప‌డుకుంటే మీరు తిన్న అంట్లు మేమే తోమేస్తాం! అన్న‌ట్టుగా గెలుపు కోసం భారీగానే ప్ర‌యాస‌ప‌డుతున్నాడు.

కేసీఆర్ మ‌ళ్లీ అధికార‌పీఠం ఎక్కేది మేమే.. 110 సీట్లు గెలుస్తాం! అంటూ ధీమాగా చెప్పేశాడు. ఇక ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి వెంట‌నే అందుకుని డిసెంబ‌ర్ 7న ఎన్నిక‌లు జ‌రిగితే 11న కౌంటింగ్‌…12న కాంగ్రెస్ ప్ర‌మాణ స్వీకారం రాసుకోండి అని చెప్పేశాడు. ఉత్త‌మ్‌ది కాన్ఫిడెంటా? ఓవ‌ర్ కాన్ఫిడెన్సా?. కాన్ఫిడెన్సా అన్న‌ది అర్థం కాలేదు.అది ఓవ‌ర్ కాన్ఫిడెంట్ అయితే మొద‌టికే మోసం వ‌చ్చేప్ర‌మాదం వుంది. ఉత్త‌మ్ లెక్క తారుమారైతే కాంగ్రెస్ పార్టీలోని మిగ‌తావారి కంటే ఉత్త‌మ్‌కే ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే పార్టీని అధికారంలోకి తెచ్చేంత వ‌ర‌కు గ‌డ్డం తీయ‌న‌ని మంగ‌మ్మ శ‌ప‌థం చేశారాయ‌న‌. కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే ఆయ‌న ప‌రిస్థితేంటి? మ‌ళ్లీ ఐదేళ్లు ఆ గ‌డ్డాన్ని సాధువులా పెంచుతూ భ‌రించాల్సిందే అంటున్నాయి తెరాస వ‌ర్గాలు. స‌వాల్ విసిరితే స‌రిపోదు.. గెలిచి చూపించాలి. లేదంటే ఛాలెంజ్ నెర‌వేర్చాల్సి ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments