టీఆర్‌ఎస్‌ అంతు చూస్తామంటున్న కాంగ్రెస్

Wednesday, September 27th, 2017, 07:00:56 PM IST


తెలంగాణాలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు ఏ స్థాయిలో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా నేతలు వేసే కౌంటర్లు చాలా వైరల్ అవుతాయి. అధికారా పార్టీ అయినా.. ప్రతిపక్ష పార్టీ అయినా వేసే కౌంటర్లు కొన్ని రాజకీయాల్లో వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణాలో నేతల మధ్య ఇదే స్థాయిలో డైలాగులు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ టీఆరెస్ పై ప్రతి పక్ష పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలను చేస్తోంది. చాలా రోజుల తర్వాతవ్ ఇరు పార్టీల మధ్య వివాదాలు తార స్థాయికి చేరుతున్నాయి.

రీసెంట్ గా బతుకమ్మ చీరల పంపిణి వ్యవహారంతో ఇరు పార్టీల నేతల మధ్య కౌంటర్లు చాలానే వినిపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ టీఆరెస్ పై మరో స్ట్రాంగ్ కామెంట్ చేసింది. త్వరలో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో ను చూడటానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే కావాలనే తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వివాదంపై టీఆరెస్ ను ప్రశ్నించారు. అది ప్రజల సొత్తు అని ప్రాజెక్టును పరిశీలించడానికి వెళితే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటన్నారు. 14 వేల కోట్లతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభం అయితే ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని అది కేసీఆర్ కారణమని ఆరోపణలు చేశారు. అలాగే కేటీఆర్ కూడా మరొక కారణమని చెప్పారు. ఇక మెట్రో పనులు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉత్తమ్ చెబుతూ.. 2019లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు టీఆరెస్ అంతు చూస్తామని చెప్పారు. మరి ఈ కామెంట్స్ కి టీఆరెస్ నేతలు ఏ విధమైన కౌంటర్ వేస్తారో చూడాలి.

uttam kumar controversial comments on trs

  •  
  •  
  •  
  •  

Comments