పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ కి సమాధానం చెప్పిన ఉత్తమ్!

Friday, February 2nd, 2018, 11:50:45 PM IST

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆరెస్ పాలనపై మరోసారి తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా కేటీఆర్ ఆయనకు సవాల్ విసిరినా సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ పార్టీ ఏ మాత్రం గెలుపొందలేదని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. లేకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని ఉత్తమ్ కూడా ఛాలెంజ్ చేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సర్వేల ప్రకారం మేము ఫుల్ క్లారిటితో ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఈ స్థాయిలో అభివృధ్ది చెందింది అంటే.. కాంగ్రెస్ వల్లే. ప్రజలకు ఆ విషయం బాగా తెలుసు. దక్షిణ తెలంగాణాలో మొత్తంగా కాంగ్రెస్ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఉత్తర తెలంగాణాలో మాత్రం కొంచెం పోటీ ఉంటుంది. కానీ అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉత్తమ్ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనా వల్ల ప్రజలు విసిగిపోయారని నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో చూద్దామని ఆయన సవాల్ విసిరారు.

  •  
  •  
  •  
  •  

Comments