టీడీపీతో కాంగ్రెస్ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్!

Friday, September 7th, 2018, 07:40:11 PM IST

ఆంధ్రప్రదేశ్ కంటే ముందే తెలంగాణ రాష్త్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మొన్నటి వరకు ఏపి రాజకీయాల్లో ఏం జరుగుతుందా? ఎవరు గెలుస్తారా? అనే విషయంపై మాట్లాడుకున్న జనాలు ఇప్పుడు తెలంగాణాలో ముందస్తు ఎన్నికల ప్రభావం ఎవరిపై ఎక్కువ చూపెడుతుంది అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే ఇప్పుడు మిగిలిన పార్టీలు ఏకం కావాలని చూస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఇతర పార్టీలతో కలవడానికి చూస్తోంది.

ఓట్లు చీలితే కేసీఆర్ గెలుస్తాడని అందుకే అందరూ ఏకమైతే టీఆరెస్ పార్టీపై రీవేంజ్ తీర్చుకోవచ్చని కాంగ్రేస్ పొత్తులకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగి సంకీర్ణ ప్రభుత్వంలో తనదైన పాత్ర ఉండాలని చూసుకుంటోంది. ఇక రీసెంట్ గా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ పొత్తుపై వివరణ ఇచ్చారు. టీఆరెస్ పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని తెలిపారు. ఇక టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. శనివారం హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపనున్నట్లు ఉత్తమ్ తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments