ఇంకా మరచిపోలేదు..తిరిగి ఆర్మీ లో చేరతా అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన..!

Friday, September 30th, 2016, 09:23:46 AM IST

uttam-kumar-reddy
భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ గురించే చర్చ నడుస్తోంది.దీనిపై తెలంగాణా పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన భారత బలగాలు పాక్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులను సమర్థించారు.ఈసందర్భంగా సైనికులను అభినందించారు.

అస్థిర మైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన పాక్ ఏ క్షణాన ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టం అని అన్నారు.భారత్- పాక్ ల మధ్య యుద్ధ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.యుద్ధం వస్తే తాను తిరిగి ఆర్మీలో జాయిన్ అవుతానని సంచలన ప్రకటన చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చాలామందికి తెలియని విష్యం ఏమిటంటే అయన భారత వాయు సేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైలెట్ గా 20 ఏళ్ల పాటు సేవలందించారు.రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తాను ఏది మరచిపోలేదని అన్నారు. ఈ క్షణం అయినా విధుల్లో చేరేందుకు సిద్జంగా ఉన్నానని ప్రకటించారు. యుద్ధ సమయాల్లో శబ్ద వేగానికి రెండు రెట్ల వేగం తో విమానాలు నడపాల్సి వస్తుందని, ఆసమయం లో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోగలగాలని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments