కెసిఆర్ భయంతోనే సెల్ఫీ ని విలీనం చేసుకున్నారు – ఉత్తమ్ కుమార్ రెడ్డి 

Thursday, June 6th, 2019, 11:57:19 PM IST

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు… కెసిఆర్ కావాలనే తెలంగాణాలో తనకి ప్రతిపక్షం లేకుండా చేస్తున్నాడని, ఇప్పటికి కూడా తెలంగాణాలో కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ చీలికవర్గం ఇచ్చిన లేఖ కూడా సీఎం ఇంట్లో తయారైందని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం మీద శుక్రవారం హైకోర్టుకు వెళ్తామని, అవసరమైతే సుప్రీంకు వెళ్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇందులో  ఎలాంటి ప్రలోభాలు జరిగాయో ఆధారాలతో సహ నిరూపిస్తామని, కేసీఆర్‌ చేస్తున్న గలీజ్‌, నీచ నికృష్ట రాజకీయాలను తెలంగాణలో ప్రతి పౌరుడికి అర్ధమయ్యేలా చెబుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ టాంపరింగ్ కి పాల్పడింది అని ఎన్నో అనుమానాలు లేవనెత్తినప్పటికీ కూడా ప్రజా తీర్పును గౌరవిద్దామని ఓపికతో ఉన్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా ఎందుకు కేసీఆర్‌ భయపడుతున్నారు?, కేటీఆర్‌, హరీశ్‌రావుకు పంచాయతీ వస్తే పార్టీ ముక్కలవుతుందని ఇప్పటి నుంచే భయపడుతున్నారా? అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు.. ఏం అవసరమొచ్చింది? అని కేసీఆర్‌ను ఎంపీ ఉత్తమ్‌ ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించాక అన్ని నిజానిజాలు వెల్లడవుతాయని ఉత్తమ్ స్పష్టం చేశారు…