స్కూలు బస్సును ఢీకొన్న ట్రైన్.. 13 మంది చిన్నారులు మృతి!

Thursday, April 26th, 2018, 02:03:44 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు ధాతుతోన్న స్కూల్ బస్సును ట్రైన్ ఢీకొట్టడంతో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసింది. బస్సులో చాలా మంది పిల్లలు 10ఏళ్ల లోపువారే. డ్రైవర్ కూడా మరణించినట్లు పొలిసు అధికారులు తెలిపారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనపై స్పందించి విచారణకు అదేశించారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు.

ఇక ఘటన తాలూకు వివరాల్లోకి వెళిత.. ఖుషినగర్‌ జిల్లాలో డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు గురువారం ఉదయం బెహ్‌పుర్వా రైల్వే క్రాసింగ్‌ దగ్గర పట్టాలపై నుంచి వెళుతుండగా థావే-కపటన్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. అక్కడ అన్‌మాన్‌డ్‌ లెవల్‌ క్రాసింగ్‌ ఉండడంతో అక్కడ ఉన్న గేట్‌ మిత్ర బస్సును ఆపేందుకు ముందే ప్రయత్నం చేసినప్పటికీ ఊహించని విధంగా ప్రమాదం చోటుచేసుకుంది. రైలు దెబ్బకు బస్సు పల్టీలు కొట్టుకుంటూ పోయింది. 11 మంది చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందారు. బస్సులో మొత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికీ ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకొని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

  •  
  •  
  •  
  •  

Comments