ఉత్తరాంధ్ర, అరణ్య ప్రాంత ప్రజలకు దక్కని ప్రభుత్వ వైద్యం..!

Tuesday, September 4th, 2018, 11:00:19 PM IST

గత కొద్దిరోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఉత్తరాంధ్ర వైపు గల మూడు జిల్లాల్లోని ప్రజలు ఎక్కడపడితే అక్కడ వ్యర్ధమైన నీరు నిలిచిపోవడంతో దోమల బెడద చాలా ఎక్కువ అయ్యిపోయింది. దీనితో ఉత్తరాంధ్ర వైపు ఉన్న మూడు జిల్లాల్లో ప్రజలు మలేరియా, డెంగ్యూ మరియు విష జ్వరాల బారిన పడ్డారు. ఇది ఇలా ఉండగా వారి గోడుని పట్టించుకునే ప్రభుత్వ నాధుడే లేడు అని వారు వాపోతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారిలో ఎక్కువగా అరణ్య వాసులు ఉండటంతో వారికి వైద్యం అస్సలు అందుబాటులో లేకపోవడంతో వారు మృత్యువాత పడుతున్నారు.

ఈ గడిచిన కొద్ది రోజుల్లో విశాఖపట్నం లో గల కింగ్ జార్జి ఆసుపత్రిలో ఎప్పుడు రోజుకు ఒకటి నుంచి రెండు వేలు వరకు వ్యాధిగ్రస్తులు ఓ.పి లు తీసుకుంటే వ్యాధులు కారణంగా ఆ సంఖ్య దాదాపు 5000 కు పెరిగింది అని తెలిసింది. ఐతే వాటిలో అధికారికంగా 1200 మంది మలేరియా, డెంగ్యూ తో బాధ పడుతున్నారని తెలుస్తుంది. కొంత మంది అరణ్యవాసులు సరైన వైద్యం అందక దాదాపు 60 మంది మృత్యువాత పడ్డారు. అయిన సరే ప్రభుత్వం పట్టనట్టు ఉంటుందని ప్రజలు అంటున్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

  •  
  •  
  •  
  •  

Comments