కెసిఆర్ దుర్మార్గపు ఆలోచనలతో ఎన్నికల్లో గెలవాలనుకంటున్నారు..!

Monday, September 24th, 2018, 12:54:14 PM IST

తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఈ టీకాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమిస్తోంది అని చెప్పాలి.తెరాస పెట్టిన మేనిఫెస్టోకు ధీటుగా వారు కూడా మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు,అంతే కాకుండా తెరాస ప్రభుత్వం అక్కడి ప్రజలకు చేసిన అన్యాయాలను కూడా ఎండగడతాం అంటూ వారు ప్రచారం చేస్తున్నారు.అంతే స్థాయిలో కెసిఆర్ మీద కూడా విరుచుకుపడుతున్నారు.

వికారాబాద్ జిల్లాలోని ఏర్పాటు చేసిన ఒక మీటింగులో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని,వారి కార్యకర్తలు అందరు ఒక్క 60 రోజులు కష్టించి శ్రమిస్తే ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఎన్నికల కమిషన్ ఒక్కటయ్యిపోయి ప్రజా స్వామ్య ప్రక్రియని అనేక మార్గాలలో దుర్మార్గపు ఆలోచనలతో ఈ ఎన్నికలను గెలవాలని,ఓటర్ల జాబితా విషయంలో కూడా తప్పులు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఓటర్లు అందరు అపప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.