వీడియో : పరిటాల – పవన్ మ్యాటర్ లో ఫుల్ క్లారిటి ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే !

Thursday, January 18th, 2018, 07:30:14 PM IST

సెలెబ్రిటీల గురించి పుకార్లు రావడం అత్యంత సహజం. అది పుకారు మాత్రమే అని తెలిసినా దాని గురించే పదేపదే చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి రూమర్ లలో పవన్ కళ్యాణ్ కి పరిటాల గుండు కొట్టించారనే రూమర్ కూడా ఒకటి. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్, పరిటాల కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి కూడా ఈ విషయంలో నిజాన్ని నిగ్గుతేల్చారు. ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశి ఈ రూమర్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గుండు గురించి వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని తేల్చేశారు. నేను రవన్న దగ్గర పనిచేశా. రవన్నకు, పవన్ కళ్యాణ్ కు అసలు పరిచయమే లేదు అని అన్నారు. రవన్నే ఈ వార్తలని ఖండించారు. ఇంకా కూడా దీని గురించి మాట్లాడడం తప్పు అని వంశి అన్నారు.