పెళ్లి బంధంతో ఒకటైన మహిళా క్రికెటర్లు!

Monday, July 9th, 2018, 11:53:38 AM IST

పెళ్లితో ఒకటవ్వడం అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒక అరుదైన అనుభవం. ఒక మనస్సుకు మరో మనిషి దగ్గరవ్వడం అనేది అందరికి ఆనందాన్ని ఇచ్చే అంశం. అయితే ప్రస్తుత రోజుల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని పెళ్లిళ్ల తీరు కూడా మారుతోంది. లింగ బేధం చూపకుండా కొందరు వివాహం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. వారెవరో కాదు వరల్డ్ టాప్ ఉమెన్స్ క్రికెటర్స్ లో స్థానం సంపాదించుకున్నావారే.

సౌత్ ఆఫ్రికా మహిళా క్రికెటర్లు మరిజాన్‌ కాప్, వాన్‌ నికెర్క్‌ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని అందరిని ఆకర్షించారు. 2009 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయా క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ ఇద్దరు మంచి ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల మన్ననలను అందుకున్నారు. వాన్‌ నికెర్క్‌ అత్యధిక వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా క్రీడాకారిణిగా వన్డేలకు గాను 2017-18 బెస్ట్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అవార్డు అందుకుంది. కాప్ కూడా ఈ రికార్డును అందుకున్న క్రికెటర్ గా గుర్తింపు పొందింది. ఐసిసి టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో మరిజాన్‌ కాప్, వాన్‌ నికెర్క్‌ ఉండడం విశేషం. గతంలో వీరిద్దరిలానే న్యూజిలాండ్ కి చెందిన అమీ సాటర్‌వైట్‌ – లియా తహుహు పెళ్లిచేసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments