రాధాకు షాకిస్తున్న వంగవీటి అభిమానులు.!

Thursday, March 14th, 2019, 02:16:23 PM IST

గత కొన్ని నెలల క్రితం విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వంగవీటి రాధా తనకి జగన్ అన్యాయం చేసారని మనస్తాపానికి గురైన సందర్భంలో వంగవీటి అభిమానులు రాధాకు మద్దతుగా నిలబడి ఆత్మ హత్యా యత్నం చేసుకునేంత వరకు కూడా వెళ్లారు.ఆ తర్వాత జగన్ కూడా రాధాకు ఎలాంటి సానుకూల సూచనలూ ఇవ్వకపోవడంతో రాధా వైసీపీ పార్టీని వీడడడంతోనే జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ బయటకి వచ్చారు.ఆ తర్వాత రాధా ఏ పార్టీలోకి చేరుతారు అన్న అంశం ఇక్కడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే రాధా తెలుగుదేశం పార్టీలో చేరుతారనే వార్తలే బలంగా వినిపించిన సందర్భంలో అతను ఆ పార్టీలోకి చేరకూడదు అని కోరుకున్న వారే అధికంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే అదే సందర్భంలో రాధా జనసేన పార్టీలోకి కూడా వెళ్తే బాగుండేది అని అనుకోని వారు కూడా లేకపోలేరు.ఈ నేపథ్యంలోనే రాధా అనుకున్న విధంగానే తెలుగుదేశం పార్టీలో నిన్ననే చేరిపోయారు.దీనితో రాధకు తాము ఇక నుంచి ఎలాంటి మద్దతు ఇవ్వబోడంలేదని వంగవీటి అభిమానులు ఇప్పుడు షాకిస్తున్నారు.

రాధా తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తన తండ్రి మరణానికి ప్రధాన కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీలో అసలు ఎలా చేరుతారని అప్పట్లో రంగా గారితో ఉన్న అనుచరులు ఇప్పుడు అంటున్నారు.అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా మరికొంత మంది వంగవీటి అభిమానులు రాధా నిర్ణయం కరెక్ట్ కాదని ఇక నుంచి రాధకి వారి ఎవరి మద్దతు ఇకపై నుంచి ఉండబోదని తెలియజేస్తున్నారు.ఇప్పటికే రాధా తన పొలిటికల్ కెరీర్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.వారికి ఇప్పటి వరకు ఉన్న బలమే వారి అభిమానులు ఇప్పుడు వారే రాధను సపోర్ట్ చేయడంలేదు.మరి రాధా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.