పొలిటికల్ ఫ్లాష్..టీడీపీలో వంగవీటి రాధా చేరికకు డేట్ ఫిక్స్..!

Tuesday, February 12th, 2019, 08:05:24 PM IST

గత కొన్ని రోజుల క్రితం వంగవీటి రాధా తాను కొనసాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత వైసీపీ పార్టీపై మరియు ఆ పార్టీ అధినేత జగన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలుసు.అయితే ఆ తర్వాత రాధా ఏ పార్టీలోకి చేరుతారు అన్న అంశం కూడా పెద్ద ఎత్తునే చర్చకు వచ్చింది.అయితే అతను టీడీపీ మరియు జనసేన పార్టీల్లో చేరుతారని ఎన్నో ఊహాగానాలు వచ్చినా సరే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న వార్తలు బలంగా వినిపించాయి.

అయితే అప్పుడు వంగవీటి అభిమాన వర్గం నుంచి వ్యతిరేఖత వచ్చినా రాధా వాటిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఖరారు చేసేసారు. అయితే ఇప్పుడు రాధా టీడీపీలో చేరిక పట్ల మరో క్లారిటీ బయటకు వచ్చింది.రాధ టీడీపీ కండువా కప్పుకునే తేదీ ఫిక్స్ అయ్యినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.రాధా ఈ నెల 22వ తేదీన అధికారికంగా తెలుగుదేశం పార్టీలో ఆ చేరి కండువా కప్పుకోనున్నారని స్పష్టం చేస్తున్నారు.ఇప్పటికే చాలా మందికి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అతని అభిమాన వర్గానికి ఇష్టం లేదు..ఇప్పుడు అధికారికంగా చేరుతున్నారన్న వార్త కూడా వచ్చేసింది.మరి రాధా ఆ పార్టీలో చేరినట్టయితే ఆయన అభిమానజనం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.