బిగ్ బ్రేకింగ్ : టీడీపీలోకి అఫిషియ‌ల్‌గా చేరునున్న రాధా.. పోటీ అక్క‌డ నుండే..?

Tuesday, March 12th, 2019, 11:02:55 AM IST

విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా వైసీపీ గుడ్ బై చెప్పేసి ఏ పార్టీలో చేరాల‌నే విష‌యం పై కొద్ది రోజులుగా డైల‌మాలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కి రాధా టీడీపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి.

వైసీపీకి రాజీనామా చేసిన త‌ర్వాత టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో చ‌ర్చించిన రాధా విజ‌య‌వాడ‌లోని పేద‌ల‌కు ఇళ్ళ పట్టాలు మంజూరు చేస్తామ‌ని హామీ ఇస్తే టీడీపీలో చేర‌తాన‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ విష‌యం పై చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతో రాధా టీడీపీలో చేరిక ఆల‌స్య‌మైంది. అయితే ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ విడుద‌ల అవ‌డంతో తాజాగా విజ‌య‌వాడ మాజీ ఎంపీతో రాధాతో క‌లిసి చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యారు.

ఈ క్ర‌మంలో రాధా మ‌రోసారి ఇళ్ళ ప‌ట్టాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం, దానికి చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించ‌డంతో, రాధా అధికారికంగా టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అలాగే త‌న‌కు టిక్కెట్ విష‌యంలో మాత్రం రాధా కోరిన విజ‌య‌వాడ సెంట్రల్ టిక్కెట్ కుద‌ర‌ద‌ని, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ నుండి పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నం ఎంపీగా ఉన్న కొన‌క‌ళ్ళ నారాయ‌ణ‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నామ‌ని, దీంతో అక్క‌డ ఎంపీగా రాధాను బ‌రిలోకి దించాల‌ని చంద్ర‌బాబు తెల్ప‌గా, దానికి రాధా అంగీక‌రించార‌ని తెలుస్తోంది. దీంతో కొన్ని రోజులుగా రాధా భ‌విష్య‌త్తు పై అనుమానాలు వ‌చ్చిన నేప‌ధ్యంలో రాధా టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మ‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.